సచివాలయంలో ఇవాళ ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవం

-

తెలంగాణ నూతన సచివాలయ ప్రాంగణంలో పునర్నిర్మించిన ప్రార్థనా మందిరాలను ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. పాత సెక్రటేరియట్ ప్రాంగణంలో ఉన్న ప్రార్థనా మందిరాలను రాష్ట్ర ప్రభుత్వం పునః నిర్మించిన విషయం తెలిసిందే. సచివాలయానికి నైరుతి మూలన నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని విశాలంగా నిర్మించారు.

ప్రధాన ఆలయంలో భాగంగా గర్భగుడి, మహా మండపం.. నల్లపోచమ్మ ఆలయంతో పాటు శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయం, గణపతి ఆలయం, సుబ్రహ్మణ్యస్వామి ఆలయ నిర్మాణం కూడా జరిగింది. ఈరోజు నల్లోపచమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేసి ఆలయాన్ని కేసీఆర్ పునఃప్రారంభిస్తారు.

మరోవైపు.. గతంలో ఉన్న స్థలంలోనే రెండు మసీదులను నిర్మించారు. మసీద్- ఏ – మోతెమది, మసీద్ – ఏ – హాష్మితో పాటు ఇమామ్ నివాసాన్ని నిర్మించారు. మసీద్​, ఇమామ్ నివాసం సచివాలయానికి పశ్చిమ భాగాన ఉన్నాయి. మసీదుల సమీపంలోనే చర్చ్​ను నిర్మించారు. నేడు ఇస్లాం, క్రిస్టియన్ మతాల సాంప్రదాయాలను అనుసరించి ఆయా మత పెద్దల ఆధ్వర్యంలో వీటిని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news