ఓబులాపురం మైనింగ్ కేసుపై నాంపల్లి కోర్టు కీలక తీర్పు

-

ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది.  OMC కేసులో ఐదుగురికి శిక్ష ఖరారు చేసింది. ఇక మరో ఇద్దరిని నిర్ధోషులుగా ప్రకటించింది కోర్టు.. ఈ కేసులో ఇప్పటికే ఒకరు మృతి చెందగా.. అలాగే, ఐఏఎస్ శ్రీలక్ష్మీ పై కేసు కొట్టేసింది హైకోర్టు. OMC కేసులో కృపానంద, సబిత ఇంద్రారెడ్డిలకు క్లీన్ చిట్ ఇచ్చింది.  2004-2009 వరకు గనులశాఖ మంత్రిగా ఉన్నారు సబితా ఇంద్రారెడ్డి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓబులాపురం కేసుపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తులపై కేసు నమోదు అయింది. అయితే  ఏ1 గా బీ.వీ.శ్రీనివాస్ రెడ్డి, ఏ2 గాలి జనార్దన్ రెడ్డి, ఏ3 వీ.డీ.రాజగోపాల్, ఏ4గా ఓబులాపురం మైనింగ్ కంపెనీ, ఏ5 మెహాఫస్ అలీఖాన్ లకు ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తు కోర్టు తీర్పు వెల్లడించింది. 2009 డిసెంబర్ 7న సీబీఐ కి ఫిర్యాదు చేసింది ఉమ్మడి కాంగ్రెస్ ప్రభుత్వం. సీబీఐ అధికారులు రంగంలోకి దిగి ఆధారాలను సేకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news