నార్సింగిలో డబుల్ మర్డర్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మృతి చెందిన మహిళ, యువకుడిని గుర్తించారు నార్సింగి పోలీసులు. యువకుడు మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్‌గా గుర్తించారు పోలీసులు. మహిళ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందుగా గుర్తించారు. నానక్‌రామమ్‌గూడలో అంకిత్, ఎల్బీనగర్లో బిందు నివాసం ఉందని అంటున్నారు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 8న బిందును ఎల్బీనగర్ నుంచి తీసుకొచ్చి.. నానక్‌రామ్‌గూడలోని స్నేహితుల రూమ్‌లో ఉంచాడు అంకిత్. అయితే… గచ్చిబౌలిలో అకింత్ మిస్సింగ్ కేసు నమోదు అయింది. వనస్థలిపురంలో బిందుపై మిస్సింగ్ కేసు నమోదు అయింది. నిన్న నార్సింగి పుప్పాలగూడలో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు పోలీసులు. హత్య చేసిన వారి కోసం గాలిస్తున్నారు నార్సింగ్ పోలీసులు.