ఈ నెల 16న అంటే రేపు దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పీఆర్ టీమ్ కు కీలక ఆదేశాలు ఇచ్చింది కాంగ్రెస్. ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని…సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇవ్వాలని ఆర్డర్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా… ప్రస్తుతం ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. ఇవాళ కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధాన కార్యాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. కొత్త భవనంతో పాటు, త్వరలో సరికొత్త రూపును సంతరించుకోనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ కార్యక్రమంలో కోసం నిన్ననే ఢిల్లీ కి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి.