40లక్షల మందికి లబ్ది చేకూర్చేలా కొత్త రేషన్ కార్డులు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

గత ప్రభుత్వం రేషన్ కార్డులపై దృష్టి పెట్టలేదని.. తెలంగాణ పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. దాదాపు 40 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా కొత్త రేషన్ కార్డులు తీసుకొస్తున్నామని చెప్పారు. కరీంనగర్ జిల్లాలోని నారాయణపూర్ లో నిర్వహించిన గ్రామ సభకు ఆయన హాజరై మాట్లాడారు. రేషన్ దుకాణాల్లో ఇక నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. 

వ్యవసాయ యోగ్యమైన భూములకు ఏటా ఎకరానికి రూ.12వేలు ఇస్తామని ఉత్తమ్ తెలిపారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు డబ్బులు ఇస్తామన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తీసుకొచ్చేలా చేయడమే తమ విధానం అని చెప్పారు ఉత్తమ్. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముంపు గ్రామాల ప్రజలకు సరైన న్యాయం చేస్తామన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version