సైఫ్ అలీ ఖాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇటీవల కత్తిపోట్లకు గురై ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం నిన్న ఆయన డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సైఫ్ అలీఖాన్‌కు మధ్య ప్రదేశ్ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది.
పటౌడీ కుటుంబానికి చెందిన రూ.15వేల కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని మధ్యప్రదేశ్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అనుమతినిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. ఎనిమీ ప్రాపర్టీ చట్టం కింద పాకిస్తాన్‌కు వలస వెళ్లిన వారి ఆస్తులను కేంద్రం చేసుకోవచ్చు. సైఫ్ అలీఖాన్ పూర్వీకులైన పటౌడీ ఫ్యామిలీకి భోపాల్‌లో భారీగా ఆస్తులు ఉన్నాయి. వీటిపై సైఫ్, ఆయన తల్లి శర్మిష్ట సహా కుటుంబసభ్యులు కోర్టుకెళ్లారు. ఇన్నాళ్లూ ఆ ప్రాపర్టీపై స్టే విధించిన మధ్యప్రదేశ్ హైకోర్టు తాజాగా కేంద్రం స్వాధీనం చేసుకోవాలని తీర్పునిచ్చింది.