రికార్డు సృష్టించిన తెలంగాణ..రెవెన్యూ రాబడి 14,137 కోట్లు

-

రెవెన్యూ రాబడిలో తెలంగాణ రికార్డు సృష్టించింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారీగా ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల లావాదేవీల ద్వారా రూ.15,600 కోట్ల రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.

దీన్ని నిజం చేస్తూ రూ.14,137 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఇది గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడి కంటే రూ.1,800 కోట్లు అధికమని, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రూ.14 వేల కోట్లు దాటడం ఇదే తొలిసారని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలకు సంబంధించి 19.20 లక్షలకుపైగా డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అయినట్టు తెలిపారు.2014-15 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.2,175 కోట్లుగా ఉన్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి గత తొమ్మిదేండ్లలో ఏకంగా 552% పెరగడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version