నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారు “నెక్ టు నెక్” పోటీ తప్పదా ?

-

నెల్లూర్ జిల్లా రాజకీయాల్లో మార్పులు రావడం వలన వైసీపీ లో ఒక కుదుపు వచ్చింది. వరుసగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం, నెల్లూర్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మరియు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి లు పార్టీ మరియు ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేయడంతో జగన్ సందిగ్ధంలో పడ్డాడు. దీనితో ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే లు మనసులు మారుతున్నాయి అంటూ ప్రతిపక్ష టీడీపీ ప్రచారం చేస్తోంది.

కాగా నెల్లూర్ లో సిటీ ఎమ్మెల్యే స్థానం ఎంత ప్రధానమో తెలిసిందే. ఈ సారి టీడీపీ ఎలాగైనా దీనిని గెలుచుకోవాలి అని వ్యూహాలు రచిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుండి పొంగురు నారాయణ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ చేతిలో 1000+ ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. కానీ ఈ సారి పకడ్బందీగా ప్లాన్ చేసి వైసీపీని మట్టి కరిపించాలని టీడీపీ చూస్తోంది. కాగా ఇటీవల నెల్లూర్ టీడీపీ నాయకులు చంద్రబాబును కలిసి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి గురించి చర్చించగా… చంద్రబాబు మళ్లీ నారాయణ పోటీ చేస్తారని మీరు అందరూ సహకరించాలని చెప్పునట్లు తెలుస్తోంది. మరి ఈ సారి కూడా సిటీ ఎమ్మెల్యే స్థానం కోసం నెక్ టు నెక్ పోటీ తప్పదా ??

Read more RELATED
Recommended to you

Exit mobile version