తెలంగాణ ఆర్టీసీ కొత్త వెబ్ సైట్ ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆర్టసీ చైర్మెన్ బాజీ రెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఈ కొత్త వెబ్ సైట్ ను ప్రారంభించారు. దీంతో టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ పోర్టల ఇక నుంచి tsrtc.telangana.gov.in గా ఉండనుంది. కాగ హైదరాబాద్ లోని బస్ భవన్ లో గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ఆర్టీసీ చైర్మెన్, ఎండీ పాల్గొన్నారు.
అనంతరం ఆర్టీసీ కొత్త వెబ్ సైట్ ను ప్రారంభించారు. పాత వెబ్ సైట్ ను కాస్త మార్చి కొత్త హంగులను జోడించి ఈ వెబ్ సైట్ ను రూపొందిచామని తెలిపారు. ఈ కొత్త వెబ్ సైట్ చాలా సులువుగా ఉంటుందని తెలిపారు. సామాన్యులు కూడా ఈ కొత్త వెబ్ సైట్ ను వినియోగించేలా ఉంటుందని అన్నారు. అలాగే అందరూ కూడా టీఎస్ఆర్టీసీ కొత్త వెబ్ పోర్టల్ ను సందర్శించాలని కోరారు. అలాగే ప్రయాణీకుల సూచనలు, అభిప్రాయాలను కూడా ఈ వెబ్ సైట్ ద్వారా తమ దృష్టికి తీసుకురావచ్చని అన్నారు.