తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్పు ఖాయం కానుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతి కుమారి పదవి కాలం.. అతి త్వరలోనే ముగియనుంది. వచ్చేనెల అంటే ఏప్రిల్‌లో ఆమె పదవి కాలం ముగుస్తుంది. ఈ తరుణంలోనే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు అనేదానిపైన అందరూ చర్చించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే తదుపరి ప్రధాన ప్రభుత్వ కార్యదర్శి గా… కే రామకృష్ణారావు పేరును ప్రభుత్వం ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 1980 బ్యాచ్‌కు సంబంధించిన.. సీనియర్ అధికారిగా రామకృష్ణారావుకు గుర్తింపు ఉంది.. ఆయన ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయన.. పదవీకాలం ఆగస్టు నెలతో ముగుస్తుంది. కెసిఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు.. దాదాపు 12 సార్లు బడ్జెట్ రూపొందించిన అధికారిగా రికార్డు సృష్టించారు రామకృష్ణారావు.