వైయస్సార్ జిల్లా పేరు మార్చుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైయస్సార్ జిల్లాను వైయస్సార్ కడప జిల్లాగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు కేబినెట్. గతంలో కడప పేరు తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా వైసీపీ ప్రభుత్వం పేరు మార్చిన సంగతి తెలిసిందే. అయితే.. చంద్రబాబు సర్కార్ మాత్రం వైయస్సార్ కడప జిల్లాగా పేరు మార్చింది.

ఇక తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ పై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. నంబూరులో వివిఐటియు ప్రైవేటు యూనివర్సిటీకి హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతపురం, సత్యసాయి జిల్లాలలో రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ లో ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. వైయస్సార్ తాడిగడప మున్సిపాలిటీ.. పేరు ఇకపై తాడిగడప మున్సిపాలిటీ గా పేరు మార్చుతూ… నిర్ణయం తీసుకుంది చంద్రబాబు సర్కార్. అలాగే సీఎం కార్యాలయంలో ముగ్గురు ఫోటోగ్రాఫర్లు అలాగే వీడియో గ్రాఫర్ల పోస్టులకు ఆమోదముద్రవేసింది కేబినెట్.