తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగిందన్న వార్తలు అవాస్తవమని అన్నారు డిజిపి మహేందర్ రెడ్డి. “సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా రంగాలలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఎన్సిఆర్బి నివేదికను ఉటంకిస్తూ పలు వార్తా పత్రికల్లో కథనాలు వచ్చాయి. మీడియాలో వచ్చిన ఈ వార్తా కథనాలతో నేరాల వాస్తవ చిత్రాన్ని ప్రతిబింబించే విధంగా లేవు. సైబర్ క్రైమ్స్ మరియు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయినప్పటికీ, ఈ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొని, నేరాలకు గురైన బాధితులకు తగు న్యాయం చేయడంలో తెలంగాణ పోలీసులు తీసుకున్నసమర్ధవంతమైన చర్యలే ప్రధాన కారణం.
సైబర్ నేరాలు:
నేటి డిజిటల్ యుగంలో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు అధికంగా నమోదవుతున్నాయి.. జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఎన్సిఆర్ నుండి చాలామంది సైబర్ నేరస్థులు పనిచేస్తున్నారు. వీరు దేశవ్యాప్తంగా అనేక మందిని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నారు. పలు పోలీసు ఏజెన్సీలు, స్టీక్ హోల్డర్లు మధ్య సైబర్ క్రైమ్ నివారణ, గుర్తింపు ప్రయత్నాలను సమన్వయం చేసేందుకై భారత ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఇండియన్ సైబర్ క్రైమ్స్ కోఆర్డినేషన్ సెంటర్ (I 4 C)ని ఏర్పాటు చేసింది.
I 4 C కింద, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 తోపాటు నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) లను ఏర్పాటు చేసి వీటిలో సైబర్ నేరాలను సులభంగా, వేగంగా నమోదు చేసేందుకై భారత ప్రభుత్వం ప్రారంభించింది. జూన్ 2021లో, తెలంగాణ రాష్ట్రం NCRP మరియు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1930 ని ప్రారంభించింది.. అప్పటి నుంచి తెలంగాణ పోలీసులు సకాలంలో స్పందించడం వల్ల రూ.26.6 కోట్లు సైబర్ నేరస్తులకు చేరకుండా నిరోధించడం జరిగింది. సైబర్ నేరాల నమోదు కేంద్రం పనితీరును అన్ని రాష్ట్రాలతో కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా సమీక్షిస్తోంది.
ఈ పోర్టల్ లో నమోదైన ఆన్లైన్ ఫిర్యాదులను ఎఫ్ఐఆర్లుగా మార్చాలని కూడా ఆదేశాలు జారీచేసింది. తద్వారా రికవరీ చేసిన బాధితులకు డబ్బును తిరిగి వారికి చెల్లించడంతోపాటు నేరస్థులను న్యాయస్థాన పరిధిలోకి తీసుకురావచ్చే అవకాశం ఏర్పడింది..
ఈ నిర్ణయం ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ మార్పిడి శాతం 17.52% తో దేశంలోనే అత్యుత్తమంగా ఉంది. ఎఫ్ఐఆర్ల నమోదు నేరస్థులను అరెస్టు చేయడం, చోరీ అయిన డబ్బును తిరిగి రికవరీ చేయడం తద్వారా బాధితులకు న్యాయం చేసే అవకాశం ఏర్పడింది.
దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖ ఆన్లైన్ పిటీషన్లను ఎఫ్ఐఆర్లుగా మార్చడంలో మొదటి స్థానంలో నిలిచింది. అయితే అనేక రాష్ట్రాలు సైబర్ క్రైమ్ లపై ఆన్లైన్ పిటిషన్లను స్వీకరించినప్పటికీ, నేరాలను నియంత్రించడం, బాధితులకు న్యాయం చేయడంలో మాత్రం తెలంగాణా పోలీసు అన్ని రాష్ట్రాల కన్నా ముందంజలో ఉంది. ఇది పోలీస్ శాఖ నిబద్ధతను తెలియచేస్తోంది..
నమోదైన ఫిర్యాదుల సంఖ్య ప్రకారం భారతదేశంలోని టాప్ 10 రాష్ట్రాలు క్రింది విధంగా ఉన్నాయి
క్రమ సంఖ్య/ రాష్ట్రం/యుటిలు నమోదైన సైబర్ క్రైమ్ ఆన్లైన్ ఫిర్యాదులు/ నమోదైన ఎఫ్ఐఆర్లు/ FIR మార్పిడి శాతం/ నిలిపివేసిన మొత్తం (కోట్లలో)
1. ఉత్తర ప్రదేశ్ 220131 1432 0.65 17.08
2. ఢిల్లీ 143712 3919 2.73 7.21
3. మహారాష్ట్ర 126811 950 0.73 20.03
4. రాజస్థాన్ 91033 236 0.26 13.90
5. తెలంగాణ 80697 14135 17.52 26.60
6. గుజరాత్ 78515 885 1.13 17.05
7. తమిళనాడు 73215 1664 2.27 5.74
8. కర్ణాటక 63660 451 0.71 3.67
9. హర్యానా 55176 1048 1.90 4.37
10. పశ్చిమ బెంగాల్ 43689 108 0.25 1.62″.