తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ తో ప్రజలు ఇబ్బంది పడుతుంటే నిమ్స్ ఆస్పత్రిలో ని కాంట్రాక్టు ఉద్యోగులు వారి సమస్యలు తీర్చాలంటూ నిరసనకు దిగారు. నేడు వారి సమస్యలు తీర్చాలంటూ నిమ్స్ ఆస్పత్రిలో నిరసన కార్యక్రమం చేశారు. తమ కష్టాలను అనేకసార్లు ఉన్నత అధికారుల దృష్టి కి సంవత్సరం రోజుల నుండి తీసుకువెళ్లినా, రేపు ఎల్లుండి అంటూ కాలాన్ని గడుపుతున్నారే తప్పించి తప్పించి వారి సమస్యలను తీర్చలేకపోతున్నారు. అయితే ఈ కరోనా సమయంలో కూడా రోగులకు సేవలు అందిస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి కనీసం పీపీఈ కిట్స్, మాస్క్ లు కూడా సమయానికి అందివ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా వార్డులో రోగుల వద్ద విధులు నిర్వహించిన వారికి కొంత మందికి వైరస్ సోకిందని, అయితే వారిని హోం క్వారంటైన్ కి పరిమితం చేయడమే కాకుండా కేవలం సగం జీతం ఇవ్వడం దారుణమని తెలియజేశారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన పది శాతం ఇన్సెంటివ్ కూడా ఒక్క సారి మాత్రమే ఇచ్చారని వారు ఆందోళన చేపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తాము ఎంత కష్టపడుతున్నామో ఆలోచించి వారి డిమాండ్లు తీర్చాలని కోరుతున్నారు.