ఎన్నికల పేరుతో పంట బోనస్‌ నిలిపివేస్తారా? : నిరంజన్ రెడ్డి

-

కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలనపై శ్రద్ధ చూపించట్లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి అన్నారు. ఆ పార్టీకి ఇతర పార్టీల నుంచి చేరికలపై ఉన్న దృష్టి ప్రజా సంక్షేమంపై లేదని మండిపడ్డారు. ఇక ఈ ప్రభుత్వం రైతుల గురించి పూర్తిగా మరిచిపోయిందని విమర్శించారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని, కనీసం రైతు బంధు నిధులు కూడా అందజేయలేక పోయిందని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వ తీరుపై విరుచుకు పడ్డారు.

“మా ప్రభుత్వంలో 65 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వల సామర్థ్యానికి పెంచాం. పంటకు బోనస్ ఇస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటే మరిచారు. యాసంగి పంటకు బోనస్‌ ఇస్తారో… లేదో చెప్పాలి. లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయని చెప్పి బోనస్‌ నిలిపివేస్తారా? 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాం వద్దకు వెళ్లనివ్వకుండా తాళాలు వేశారు. కేసీఆర్‌ పాలనలో అంబేడ్కర్‌ విగ్రహం నిర్మాణం జరిగిందని వివక్ష చూపిస్తున్నారు. అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వడానికి కాంగ్రెస్‌కు ఇష్టం లేదు.” అంటూ నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version