రైతులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కిషన్ రెడ్డి దీక్ష

-

రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి దీక్ష చేపట్టారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు దీక్షకు దిగారు. పార్టీ శ్రేణులతో కలిసి కిషన్‌రెడ్డి చేపట్టిన దీక్ష మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కిషన్‌ రెడ్డి డిమాండ్‌  చేశారు. 2 లక్షల రైతు రుణమాఫీ, రైతు భరోసా అందజేయాలని అన్నారు.

అలాగే, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రైతు కూలీలందరికీ 12 వేల రూపాయలు ఇవ్వాలని పేర్కొన్నారు.  వరికి 5 వందల రూపాయల బోనస్ అందించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల దెబ్బతిన్న పంటలతో నష్టపోయిన రైతులకు 25వేల రూపాయలు ఇవ్వాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల్లో రైతులపై హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మాటలకే కానీ చేతలకు కాదని ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version