రఘునందన్ రావు భేషరతుగా క్షమాపణ చెప్పాలి – నిరంజన్ రెడ్డి

-

రఘునందన్ రావు భేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్‌ చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డికి 3 ఫాం హౌజులు ఉన్నట్లు నిన్న రఘునందన్‌ రావు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. రాజకీయ దుగ్దతో రఘునందన్ రావు ఆరోపణలు చేస్తున్నారని.. మా స్వగ్రామం పాన్ గల్ లో నాకు ఉన్న భూములు 2014, 2018 ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నవే .. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది నా సతీమణి సొంత డబ్బులు, బ్యాంకులోనుతో కట్టుకున్న ఇల్లు అన్నారు.

విదేశాల్లో చదువుకుని, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న మేజర్లు అయిన మా ఇద్దరు అమ్మాయిలు స్వార్జితంతో చండూరులో సురవరం ప్రతాపరెడ్డి వారసుల నుండి, ఇతరుల నుండి చట్టబద్దంగా భూములు ఖరీదు చేశారు .. ఎస్టీల పేరు మీద కొని తర్వాత మార్చుకున్నారు అని రఘునందన్ రావు ఆరోపించారని మండిపడ్డారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు , ఏదో రంధ్రాన్వేషణ చేసినట్లు తొలుత భూములు కొని ఎస్టీల పేరు మీదకు .. తర్వాత మంత్రి కుటుంబ సభ్యుల పేరు మీదకు వెళ్లాయని రఘునందన్ రావు అన్నారన్నారు. తల్లితండ్రులను కోల్పోయిన పసిబాలుడు గౌడ నాయక్ ను చేరదీసి ఇంట్లో పెట్టుకుని పెంచి పెద్దచేసి ఉన్నత చదువులు చదివించింది వనపర్తి నియోజకవర్గం అంతా తెలుసు .. తను మా కుటుంబసభ్యుడే .. ప్రస్తుతం ఇంటి వ్యవహారాలు చూసుకునేది అతడేనని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version