‘తెలంగాణలో మోదీకి నో ఎంట్రీ’ అంటూ హైదరాబాద్ లో ఫ్లెక్సీలు

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణాది పర్యటన రేపటి నుంచి షురూ కానుంది. నవంబర్ 11న కర్ణాటక, తమిళనాడులో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మోదీ.. అదే రోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఏపీలో ఆరోజు రాత్రి రోడో షో నిర్వహించనున్నారు. మరుసటి రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని.. మధ్యాహ్నం తెలంగాణ చేరుకుంటారు.

అయితే మోదీ పర్యటనను ఇప్పటికే టీఆర్ఎస్, వామపక్ష పార్టీలు, పలు కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాని పర్యటనపై కార్మికలోకం భగ్గుమంటోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. మోదీ నో ఎంట్రీ టూ తెలంగాణ (తెలంగాణలో మోదీకి ప్రవేశం లేదు) అంటూ జూబ్లీహిల్స్ చౌరస్తాలో ఫ్లెక్సీలు వెలిశాయి.

శనివారం రోజున తెలంగాణలో పర్యటించనున్న మోదీ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితమిస్తారు. రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించి నిర్మించిన భద్రాచలం రోడ్‌-సత్తుపల్లి రైలు మార్గాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. అయితే మోదీ పర్యటనలో ప్రొటోకాల్ పాటించలేదని టీఆర్ఎస్ ఆరోపించింది. ఆహ్వానంలో సీఎం కేసీఆర్ పేరు లేదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version