మణికొండ చిత్రపురి కాలనీలోని 225 విల్లాలకు నోటీసులు !

-

మణికొండ చిత్రపూరి కాలనీలోని 225 విల్లాలకు ఎదురుదెబ్బ తగిలింది. మణికొండ చిత్రపూరి కాలనీ లో నిర్మించిన 225 విల్లాలకు నిర్మాణ అనుమతులు లేవంటూ మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. G.O 658 కు విరుద్దంగా 225 ROW హౌజ్ ల నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. దొంగ చాటున నిర్మాణాలకు అనుమతులు పొందింది గత సొసైటీ పాలక వర్గం.

Notices for 225 villas in Manikonda Chitrapuri Colony

G+1 అనుమతులు పొంది అక్రమంగా G+2 నిర్మాణాలు చేపట్టిందని సమాచారం.. 15 రోజుల్లో నోటీసులకు రిప్లై ఇవ్వాలని సూచించిన కమిషనర్… ఈ మేరకు మణికొండ చిత్రపూరి కాలనీ లో నిర్మించిన 225 విల్లాలకు నిర్మాణ అనుమతులు లేవంటూ నోటీసులు జారీ చేశారు.
గత పాలక వర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్రపూరి సొసైటీ కి సుమారు 50 కోట్ల నష్టం జరిగింది అంటూ ఫిర్యాదులు అందాయని సమాచారం. చిత్ర పూరి లో జరిగిన అవకతవకల గుట్టురట్టు చేయాలంటూ ఫిర్యాదుల వెల్లువ వచ్చిందట.

Read more RELATED
Recommended to you

Latest news