హైదరాబాద్ లోని బడంగ్‌పేట్ మేయర్ పారిజాతకు ఐటి అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ బడంగ్‌పేట్ మేయర్ పారిజాత ఇంట్లో ముగిసాయి ఐటీ సోదాలు. నిన్న ఉదయం నుంచి పారిజాత ఇంట్లో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. ఈ తరుణం లోనే ఐటీ అధికారులు నగదు స్వాధీనం చేసుకున్నారు. దింతో ఈ నెల 6వ తేదీన ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ పారిజాత, నరసింహారెడ్డికి నోటీసులు ఇచ్చారు ఐటీ అధికారులు.
ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేతలకు సంబంధించిన 18 చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అంతే కాదు మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో ఐటీ అధికారుల తనిఖీలు జరుగుతున్నాయి. జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి వ్యాపారానికి సంబంధించిన వివరాల సేకరణ చేస్తున్నారు ఐటీ అధికారులు. కాంగ్రెస్ నేత కేఎల్ఆర్ ఇంట్లో కొనసాగుతున్నాయి సోదాలు.