కాంగ్రెస్‌ వల్లే ‘ఇండియా’ జోరు తగ్గింది: బిహార్ సీఎం నీతీశ్‌ కుమార్

-

రానున్న సార్వత్రిక ఎన్నికల్లే కేంద్రంలో మోదీ సర్కార్​ను గద్దె దించాలనే లక్ష్యంతో విపక్షాలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమి ఇప్పటికే నాలుగైదు సార్లు భేటీ అయి కార్యాచరణపై చర్చించింది. కానీ ఇప్పటి వరకు సీట్ల పంపకంపై సరైన స్పష్టతకు రానట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది.

ప్రస్తుత కాంగ్రెస్ వైఖరిపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఫోకస్ అంతా ఐదు రాష్ట్రాలపైనే ఉందని.. విపక్ష కూటమిపై ఆ పార్టీ దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. అందువల్లే మొన్నటి వరకు చాలా యాక్టివ్​గా ఉన్న ఇండియా కూటమి ఇప్పుడు స్తబ్దుగా మారిపోయిందని అన్నారు. కాంగ్రెస్ వల్లే తమ కూటమిలో పెద్దగా పురోగతి లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీయే ఈ కూటమిని ముందుండి నడిపించాలని గతంలోనే నిర్ణయించామని.. కానీ ఇప్పుడు ఆ పార్టీ ఫోకస్ అంతా ఐదు రాష్ట్రాల ఎన్నికలపై పెట్టడంతో ఇండియా కూటమి దూకుడు కొనసాగించలేక పోతోందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ తాజా వైఖరి వల్ల రానున్న లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతకు ఆలస్యం అవుతోందని నితీశ్ కుమార్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news