తెలంగాణ రాష్ట్ర మహిళా మంత్రి కొండా సురేఖకు ఊహించిన ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర మహిళా మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ అయ్యాయి. నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు.
ఇవాళ రెండో సాక్షి వాంగ్మూలం తీసుకున్నకోర్టు…నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 23 కు వాయిదా వేసింది కోర్టు.
ఇక అటు తెలంగాణ మంత్రి కొండా సురేఖ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో కేటీఆర్ తరపు లాయర్ ఉమా మహేశ్వరరావు దావా దాఖలు చేశారు. కొండా సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్, తుల ఉమను సాక్ష్యులుగా పేర్కొన్నారు.