హైదరాబాద్ లోని పాకిస్తానీయులకు నోటీసులు

-

హైదరాబాద్ లో నలుగురు పాకిస్తానీయులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నలుగురు వ్యక్తులు షార్ట్ టర్మ్ వీసా (STV) హోల్డర్స్ గా ఉన్నట్లు గుర్తించారు. రేపటి లోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. వీరిలో కేవలం నలుగురికి మాత్రమే STV, మిగతా అందరికి LTV ఉన్నట్లు గుర్తించారు.

తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ కీలక ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని పేర్కొన్నారు డీజీపీ జితేందర్. ఈ నెల 27 తర్వాత పాకిస్థానీల వీసాలు పని చేయవు అని ప్రకటించారు డీజీపీ జితేందర్. మెడికల్ వీసాల మీద ఉన్న వారికి ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉంటుందన్నారు. లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన వారికి ఈ నిబంధన వర్తించదని క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాలని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు డీజీపీ జితేందర్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news