పాక్ తో యుద్ధానికి అనుకూలంగా లేము.. సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు

-

జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ – పాకిస్తాన్ బార్డర్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. భారత బార్డర్ పై నిన్న రాత్రి పాకిస్తానీయులు కాల్పులు జరిపారు. దీంతో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం విధితమే. అయితే పాక్ యుద్ధానికి అనుకూలంగా లేమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటక సీఎం సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఉగ్ర వాదుల దాడికి భద్రతా వైఫల్యమే కారణం అని ఆయన ఆరోపించారు. కేంద్రం కశ్మీర్ లో భద్రత ను కట్టు దిట్టం చేయాలని తెలిపారు. సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు అసలు ఎప్పుడూ ఏం మాట్లాడాలో తెలియదని.. ఆ రాష్ట్రం LOP అశోక్ విమర్శించారు. ఓ వైపు దేశం మొత్తం పాకిస్తాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news