పాతబస్తీ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మరణించిన వారి కుటుంబాలకు తగు ఆర్థికసాయం చేసి అండగా నిలిచి.. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించి కాపాడాలని ప్రభుత్వాన్ని సూచించారు కేసీఆర్.

ఇది ఇది ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదం లో మరణించిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటన చేశారు.