ఈనెల 12 కోటి మొక్కలు నాటేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం

-

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది గోల్కొండలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఇప్పటికే రాష్ట్ర యంత్రాంగం తలమునకలై ఉంది. ఇక ఆగస్టు 14వ తేదీ నుంచి 24 వరకు విద్యార్థులకు ఉచితంగా గాంధీ సినిమా చూపించాలని  ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తలసాని ప్రకటించారు.

మరోవైపు.. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 12వ తేదీన కోటి మొక్కలు నాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.  ఈ వజ్రోత్సవాల ప్రారంభం సందర్భంగా 2022 ఆగస్టు 21న రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పల్లెల్లో, పట్టణాల్లో విస్తృతంగా మొక్కలు నాటారు.  అదే తరహాలో ముగింపు ఉత్సవాల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీంట్లో భాగంగా కేసీఆర్ మంచిరేవుల ఫారెస్టు పార్కులో మొక్కలు నాటనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version