హైదరాబాద్ ఇవాళ ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన చేసింది. రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడురోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది ఐఎండీ. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని.. హైదరాబాద్ లో వచ్చే రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది ఐఎండీ. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. నేడు, రేపు తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.