తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇవాళ హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ కాసేటి క్రితమే ప్రారంభం అయింది. పీఏసీ చైర్మన్ మాణిక్ రావు ఠాక్రె అధ్యక్షతన సమావేశం జరుగుతోంది.
ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా ఇతర సభ్యులు హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ సన్నద్ధం చేసే అశంపై వీరు చర్చిస్తున్నారు. పార్టీ జిల్లా, నియోజకవర్గ కార్యాలయాల నిర్మాణం, విరాళాల సేకరణ సహా పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు వేయాలని ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా అత్యంత త్వరలోనే 6 గ్యారెంటీలను అమలు చేసి ప్రజల్లోకి వెళ్లితే పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి వస్తుందని అంచెనా వేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని వారి ఆశలను నెరవేర్చాలి. లేదంటే మళ్లీ ప్రజలు నమ్మరు అని గ్రహించి పలు కీలక విషయాలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం.