తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రకృతి ప్రియుడు.. వనజీవి రామయ్య మృతి చెందారు. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య అలియాస్ దరిపల్లి రామయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చేరారు.

ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. చిన్న తనం నుంచే చెట్లు నాటుతూ ప్రకృతి సేవ చేసిన రామయ్యకు కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించి సత్కరించింది. ప్రకృతి ప్రేమికులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.