ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ రాష్ట్ర యంగ్ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సమావేశం కాబోతున్నారు. విభజన సమస్యలను పరిష్కరించుకునేందుకుగాను రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలోనే సమావేశం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

దీనికి సంబంధించిన హింట్ అధికారులు కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన మొదటి అడుగు ఆలోచనలో సీఎం చంద్రబాబు నాయుడు నట్లు అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వీళ్ళ ఇద్దరి సమావేశం ప్రగతి భవన్ వేదికగా జరిగే ఛాన్సులు ఉన్నాయని అంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గత సంవత్సరం జూలైలో ప్రగతిభవన్లో తొలిసారి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశంలో చర్చించారు. అయినప్పటికీ ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదని అంటున్నారు అధికారులు. ఇక ఇప్పుడు మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు సమావేశం కానున్నారు అని తెలుస్తోంది.