జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మారణకాండకు తెర లేపారు. ఈ సంఘటనలో 26 మంది ఇండియన్ యాత్రికులు మరణిస్తే.. మరో ఇద్దరు విదేశీయాత్రికులు మరణించారు. చిన్నపిల్లలు అలాగే మహిళలను వదిలేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులు… కేవలం పురుషులను మాత్రమే టార్గెట్ చేశారు. అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశారు. పాయింట్ బ్లాక్ లో బుల్లెట్ దింపారు పాకిస్తాన్ ఉగ్రవాదులు.
అయితే ఈ సంఘటన నేపథ్యంలో… పాకిస్తాన్ దేశానికి మోడీ ప్రభుత్వం గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఆ దేశాన్ని ఎడారి మార్చేందుకు సింధుజలాలను ఆపేసింది. ఇతర దేశాలు కూడా ఇండియాకు సపోర్ట్ గా నిలుస్తున్నాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్ర దాడికి వ్యతిరేకంగా నిరసన కూడా తెలుపుతున్నారు జనాలు.
ప్రతి గ్రామంలో నిరసన ర్యాలీలు, కాగడాల ప్రదర్శన సాగుతోంది. పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే దుండిగల్ ప్రాంతంలో కూడా… అక్కడ యూత్, పెద్దలు, పలువురు నాయకులు… నిరసన తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను.. ఎన్కౌంటర్ చేయాల్సిందే అంటూ… నిరసన తెలుపుతూ.. దుండిగల్ ప్రాంతంలో ర్యాలీలు కూడా తీశారు. పహాల్గం మారణకాండ కు నిరసనగా కాగడా ర్యాలీ కూడా తీశారు.
ఇక ఈ కార్యక్రమంలో… సీహెచ్ వెంకటేశం, ఎల్ నర్సింగ్ గౌడ్, దుండిగల్ పెద్దమ్మ తల్లి ఆలయ అధ్యక్షులు తలారి రాజ్ కుమార్ ముదిరాజ్, తురై భాను, ఎల్లూరి శ్రీధర్ గౌడ్, డి విగేశ్వర్, అకుల మల్లేష్, అకుల విజయ్ సాయి సందనబోయిన వెంకటేష్ ముదిరాజ్, దొంతి మహేష్ ముదిరాజ్, నామాల నరేష్, ఉల్లా యాదగిరి, సీహెచ్ నరేష్, టింకు ముదిరాజ్, అకుల యశ్వంత్, సోను గౌడ్, తలారి అనిల్, శివ తదితరులు పాల్గొన్నారు.
View this post on Instagram