CM క్యాంప్ ఆఫీస్ గా పైగా ప్యాలెస్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అక్కడినుంచే సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగించనున్నట్లు తెలుస్తోంది. బేగంపేట్ లోని ఈ ప్యాలెస్ ను ఉన్నతాధికారులు ఇప్పటికే పరిశీలించారు. సీఎం భద్రతకు అణువుగా ఉంటుందని భావిస్తున్నారు.
ఈ ప్యాలెస్ ను 1900లో ఆరో నిజాం నవాబ్ నిర్మించారు. మొత్తం 4 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ పైగా ఫ్యామిలీ నివసించడంతో దీనికి పైగా ప్యాలెస్ అని పేరు వచ్చింది. అయితే.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కానుంది.
కాగా ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana) క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలు పంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఐటీ, జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు, భారీ పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంతో తెలంగాణ ప్రతినిధి బృందం తొలి రోజునే పలువురు ప్రముఖులతో కీలక చర్చలు జరిపింది.