క్వింటాల్‌ కు రూ.700 కట్‌ చేస్తున్నారు – రేవంత్‌ సర్కార్‌ పై పల్లా సీరియస్‌

-

వరి ధాన్యం క్వింటాల్‌ కు రూ.700 కట్‌ చేస్తున్నారని రేవంత్‌ సర్కార్‌ పై పల్లా రాజేశ్వర్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ…వరి కొనుగోలు కేంద్రాలు సజావుగా సాగడం లేదన్నారు.

ప్రైవేట్ దళారులు, మిల్లర్లు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహించారు. ముఖ్య మంత్రి హెచ్చరించిన తర్వాత వడ్ల ధర ముప్పయి రూపాయలు మాత్రమే పెంచారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇస్తానన్న బోనస్ పక్కన పెడితే ప్రస్తుతం 700 రూపాయలు తక్కువ ధరకు కొంటున్నారని ఆగ్రహించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళారుల దోపిడీ నడుస్తోంది….కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వరికి 2500, మక్కలు 2200 కొంటామని హామీ ఇచ్చారన్నారు.సివిల్ సప్లై మంత్రి ఎక్కడ ఉన్నారు. ఒక్క రివ్యూ కూడా చేయరా అని నిలదీశారు. ఎన్నికల తర్వాత బోనస్ ఇస్తామని నమ్మబలుకుతున్నారు. ప్రభుత్వం మీద రైతులకు విశ్వాసం లేదు.మార్కెట్ లో అమ్మిన ప్రతి రైతుకు క్వింటాల్ కు 2200 రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news