BREAKiNG : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాల్వాయి స్రవంతి

-

బిగ్ బ్రేకింగ్ : కాంగ్రెస్ పార్టీకి పాల్వాయి స్రవంతి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు పాల్వాయి స్రవంతి. మునుగోడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి స్రవంతి భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నారు. ఇవాళ మధ్యాహ్నం భారత రాష్ట్ర సమితి పార్టీలో మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి జాయిన్ కానున్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీ కండువా కప్పుకోనున్నారు కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి.

Palvai Sravanti resigned from Congress party

అంతేకాకుండా ఆమె బాటలోనే మునుగోడు లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన చలమల బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతనికి బిజెపి మునుగోడు టికెట్ కూడా ఇచ్చేసింది. ఇక ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పార్టీలో పాల్వాయి స్రవంతి చేరనుండటంతో మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయినట్లు తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version