పార్టీ మారే ఆలోచనలో పటాన్ చెరు BRS ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..?

-

తెలంగాణలో 2023 డిసెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో  అప్పటి నుంచి వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా   మున్సిపల్ చైర్మన్లు, హైదరాబాద్ మేయర్ ఇలా పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

తాజాగా  పటాన్ చెరు BRS ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడి తీరు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేతలతో కలిసి గతంలో మహిపాల్ రెడ్డి, సోదరుడు మధుసూదన్ రెడ్డి దిగిన ఫోటోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు కుమారుడు విక్రమ్ రెడ్డి. 2008 లో రాహుల్ గాంధీ, దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డిలతో కలిసి ఉన్న ఫోటోలను వాట్సాప్ స్టేటస్ లో షేర్ చేసాడు విక్రమ్. కాంగ్రెస్ నేతలతో కలిసి దిగిన ఫోటోల స్టేటస్ చూసి అవాక్కవుతున్న పటన్ చెరు BRS నాయకులు. మహిపాల్ రెడ్డి కారు దిగుతారేమోనని కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. గత కొన్ని రోజులుగా మహిపాల్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version