నాసిరకం నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలకలం.. కేసు నమోదు

-

మంచి రుచి ఆరోగ్యం కోసం అల్లం వెల్లుల్లి పేస్టును అన్ని వంటల్లో వాడుతుంటారు.అలాంటి పేస్టును తయారు చేసి కొంతమంది కేటుగాళ్లు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. పలు ముడి పదార్థాలతో అల్లం వెల్లుల్లి పేస్టును కల్తీ చేసి జిల్లా వ్యాప్తంగా సరఫరా చేస్తున్న వ్యక్తిని ఇంద్రకరణ్ పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి రూరల్ సీఐ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..కంది మండలం జుల్కల్ గ్రామానికి చెందిన మహమ్మద్ వసీం అనే వ్యక్తి తన ఇంట్లో తహ ఫుడ్స్ పేరుతో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను గత కొద్ది రోజులుగా తయారు చేస్తున్నాడు అని తెలిపారు.

 

పలువురి నుండి సమాచారం అందిన మేరకు తనిఖీ చేసిన్ పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులతో పేస్టుని టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపించారు. అది నాసిరకం పేస్ట్ అని రిపోర్ట్ వచ్చింది. దీంతో వసీం ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు 600 కిలోల నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్ట్ సీజ్ చేశారు.ప్రజలు ఎక్కడైనా ఏదైనా కల్తీ జరుగుతున్నట్టు తమకు తెలిస్తే వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించాలని ఇంద్రకరణ ఎస్సై విజయ్ కుమార్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version