ఎస్సై శ్రీనివాస్ మృతికి ప్రభుత్వమే కారణం – బీఆర్‌ఎస్‌ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి

-

ప్రభుత్వ పని ఒత్తిడి ఉన్నతాధికారుల వేధింపులతో మృతి చెందిన “అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్” కుటుంబానికి సంతాపం తెలిపారు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ తీవ్ర పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేకనే ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి చెందాడని దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

peddi sudharshan reddy on si srinivas

ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి ఎస్సై శ్రీనివాస్ కుటుంబానికి కోటి రూపాయలు తక్షణ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎస్సై శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలని వారి కుటుంబ బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గాడి తప్పిన పాలనకు నిదర్శనమే ఎస్సై శ్రీనివాస్ మృతి అని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సై శ్రీనివాస్ మృతికి గల కారణాలపై న్యాయ విచారణ జరిపి బాధ్యులను గుర్తించి, బాద్యులైన పై స్థాయి అధికారులను కూడ గుర్తించి తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version