కొత్త పెన్షన్లపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్తగా 10లక్షల మందికి పెన్షన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. శనివారం ప్రగతి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా పది లక్షల పింఛన్లు ఇవ్వబోతున్నామన్నారు.
ప్రస్తుతం 36లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మొత్తం పింఛన్దారుల సంఖ్య 46లక్షలకు చేరుకుంటుందని చెప్పారు. 57 సంవత్సరాలున్న వారికి పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా డయాలసిస్ పేషెంట్లకు సైతం పింఛన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. డయాలసిస్ పేషెంట్లకు రూ.2016 పింఛన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
‘నాపై కేంద్రానికి కోపం రావచ్చు. కానీ చర్చ జరగాలనే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాను. కొత్తగా 10లక్షల మందికి పెన్షన్లు అందజేస్తాం. అందరికీ కొత్త కార్డులు ఇస్తాం. ఇక నుంచి 57 ఏళ్ల వయస్సు గల వారికీ పెన్షన్ ఇస్తాం. కొత్తగా డయాలసిస్ పేషెంట్లకు కూడా రూ. .2,016 పింఛన్ అందిస్తాం. స్వాతంత్ర్య వజ్రోత్సవ వేళ సత్ర్పవర్తన గల ఖైదీలను విడుదల చేస్తాం. పాలు, చేనేత ఉత్పత్తుల మీద జీఎస్టీ ఎత్తివేయాలి.’