చలికి వణికిపోతున్న తెలంగాణ, ఏపీలో ప్రజలు..సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు !

-

తెలంగాణ, ఏపీలో ప్రజలు చలికి వణికిపోతున్నారు..తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెలంగాణలోని జిల్లాల్లో… హైదరాబాద్‌ లో నిన్న రాత్రి నుంచి చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామ రాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి.

People in Telangana and AP are shivering due to cold

ఈ సీజన్ లో తొలిసారి సింగిల్ డిజిట్ నమోదు అయ్యాయి. ముంచింగిపుట్టు వద్ద 09డిగ్రీల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పాడేరు 12, మినుములూరు, ముంచంగి పుట్టులో 09 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది.

అటు ఏజెన్సీని వణికిస్తోంది చలి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు..పడిపోతున్నాయి. చలి తీవ్రతకు చలి మంటలను ఆశ్రయిస్తున్నారు స్థానికులు.. ఈ ఏడాది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో మరింత పడిపోయాయి ఉష్ణోగ్రతలు. పాడేరు వంజంగి పర్యటక కేంద్రం వద్ద మేఘాల మాటున సూర్యోదయం తిలకించేందుకు కొండ పైకి భారీగా చేరుకున్నారు పర్యాటకులు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version