ప్రజల సంపద ప్రజలకే దక్కాలన్నది కాంగ్రెస్ విధానం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఛలో రాజ్ భవన్ లో భాగంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్ భవన్ వరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రాజ్ భవన్ వద్ద రోడ్డు పై సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు బైఠాయించారు. ఈ సందర్భంగా మోడీ, అదానీ ఏక్ హై అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. దేశ సంపదను క్రోనీ క్యాపిటలిస్టులకు కేంద్రం దోచిపెడుతుందన్నారు. కేంద ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాడుతున్నారని తెలిపారు. అదానీ దేశాన్ని లూటీ చేశారని తెలిపారు. మోడీ ప్రభుత్వం గౌతమ్ అదానీ అవినీతి పై విచారణ జరపాలని.. మణిపూర్ ఘటన పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలని డిమాండ్ చేశారు.