కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుమతి

-

కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుమతి లభించింది. వైద్య విద్యలో మరో మైలురాయి చేరుకుంది తెలంగాణ. క‌రీంన‌గ‌ర్ ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీకి అనుమతి రావడం సంతోషించదగ్గ విషయం అని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హారీష్‌ రావు పేర్కొన్నారు. జిల్లాకు ఒక మెడిక‌ల్ కాలేజీ స్థాపించాల‌న్న సీఎం కేసీఆర్ ల‌క్ష్యంలో ఇది మ‌రో ముంద‌డుగు అన్నారు.

తాజా అనుమతితో ఈ ఏడాది రాష్ట్రంలో 9 మెడిక‌ల్ కాలేజీల‌కు అనుమ‌తులు సాధించి దేశ చ‌రిత్ర‌లోనే తెలంగాణ స‌రికొత్త చ‌రిత్ర‌ సృష్టించిందని తెలిపారు. ఈ ఏడాది నుండి కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగాం, రాజ‌న్న సిరిసిల్ల‌, నిర్మ‌ల్‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, క‌రీంన‌గ‌ర్‌లో మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం కానున్నట్లు చెప్పారు హరీష్‌ రావు.

దీంతో విద్యార్థుల‌కు అందుబాటులోకి రానున్నాయి 900 ఎంబీబీఎస్ సీట్లు. తెలంగాణ ఏర్ప‌డే నాటికి ఉన్న మెడిక‌ల్ కాలేజీల సంఖ్య కేవ‌లం 5. తొమ్మిదేండ్ల‌లోనే సీఎం కేసీఆర్ మార్గ‌నిర్దేశ‌నంలో ఏర్పాటైన మెడిక‌ల్ కాలేజీల సంఖ్య 21. మొత్తం 26 గా నమోదు కానుంది. జిల్లాకు ఒక మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటు చేయ‌డం ద్వారా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు స్పెషాలిటీ సేవ‌లు చేరువ అవడంతో పాటు, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య చేరువైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version