నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ తరుణంలోనే సర్వే సంస్థలకు బిగ్ షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం. ఇక పై సర్వేలు బంద్ కానున్నాయి. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అన్ని రకాల సర్వేలకు పుల్‌స్టాప్ పడినట్లేనని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.
రేపటి నుంచి ఏ సంస్థ, ఏ వ్యక్తి గానీ ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి సర్వేలను ప్రజలకు వెల్లడించకూడదని వార్నింగ్ ఇచ్చింది ఎన్నికల సంఘం. ప్రీపోల్ సర్వే, ఒపినియన్ పోల్ సర్వే, అంశాల వారీ సర్వే సహా ఎలాంటి సర్వేల వెల్లడికి పర్మిషన్ బంద్ చేయనుంది ఎన్నికల సంఘం. జూన్ 1న మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించడానికి అనుమతించడం లేదు ఎన్నికల సంఘం.