రేవంత్ కు షాక్ తగిలింది… తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై హైకోర్టుకు జూలూరి గౌరీ శంకర్ వెళ్లారు. డిసెంబర్ 9న సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను ఆపాలని పిల్ వేశారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను తెలంగాణ ప్రజలు,మేధావులు,రచయితలు,కవులు, కళాకారులు వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
విగ్రహం లో మార్పులు అంటే తెలంగాణ అస్తిత్త్వం జరుగుతున్న దాడిగా భావిస్తోంది తెలంగాణ సమాజం అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ నా కోటి రథనాల వీణ అని మహాకవి దాశరధి గారు అన్నట్టుగానే నాడు ప్రొఫెసర్ జయశంకర్,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో అనేక మంది మేధావులు,తెలంగాణ ఆత్మబంధువుల సమక్షంలో ఉద్యమకాలంలో రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లిని కేసీఆర్ గారి మీద రాజకీయ కక్షతో తెలంగాణ మీద ఈసమెత్తు కూడా అవగాహన,సోయి లేని వ్యక్తి నేడు కుట్రలు చేయడాన్ని తెలంగాణ సమాజం ఖండిస్తుందని పిల్ వేశారు. తెలంగాణ తల్లి విగ్రహం లో మార్పులు చేయకుండా,డిసెంబర్ 9న మార్చిన విగ్రహం ప్రతిష్టను ఆపాలని ప్రముఖ రచయిత జూలూరి గౌరీ శంకర్ గారి నేతృత్వంలో అనేక మంది మేధావులు హైకోర్టు లో పిల్ వేశారు.