కాంగ్రెస్ ఏడాది పాలనపై మంత్రి పొన్నం ఏమన్నారంటే?

-

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నేటికి ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిందని, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా శాఖల పరంగా,ప్రభుత్వ పరిపాలన పరంగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, కార్యకర్తలు సంతృప్తిగా ప్రజాసేవ చేశామన్నారు.

తమ ప్రభుత్వం ఏడాది పాలనలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ , రూ.500 గ్యాస్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 55 వేల ఉద్యోగాల భర్తీ చేశామన్నారు. గురుకులాల్లో 40 శాతం కాస్మొటిక్ అండ్ డైట్ చార్జీలు పెంచామని గుర్తుచేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని, భవిష్యత్‌లో మిగతా హమీలను సైతం పూర్తి చేస్తామన్నారు. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news