ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలిసిన యూనివర్సిటీ విద్యార్థులు వినతిపత్రం అందించారు. సోమవారం యూనివర్సిటీకి వచ్చిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులను కలిసి విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకున్నారు. యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులకు ఫెలోషిప్, ఉచిత భోజన వసతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఓయూలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ టీచింగ్, నాన్ టీచింగ్ పోర్షన్ వెంటనే భర్తీ చేయాలని కోరారు.
యూనివర్సిటీ అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.1000 కోట్లు కేటాయించాలని కోరారు. ఓయూ లో డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ స్టడీ సెంటర్ ను స్థాపించాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం అందించిన వారిలో రీసెర్చ్ స్కాలర్స్,విద్యార్థులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, కొమ్ము శేఖర్ మాదిగ, వలిగొండ నరసింహా, సొందే అన్సర్, అజయ్ సామ్రాట్, నందు, ఆరెకంటి శ్రీకాంత్, కొప్పు శ్రీశైలం, వంశీ తదితరులు పాల్గొన్నారు.