ఈ దసరాకు హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రారంభం..!

-

అన్నిరంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణ ఫార్మారంగంలోనూ ప్రగతి పథంలో ముందడుగేస్తోంది. అందుకే దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా నిలిచే ఫార్మాసిటీని నిర్మిస్తోంది. ఇప్పటికే దాదాపుగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఔషధ నగరి ప్రారంభానికి దాదాపు ముహూర్తం ఖరారైంది. ఈ విజయదశమి రోజున ఫార్మాసిటీని ప్రారంభించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం.

ఇటీవల రంగారెడ్డి జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు సంబంధించిన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫార్మాసిటీలో ఇప్పటికే మౌలిక వసతుల పనులను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చురుగ్గా నిర్వహిస్తోంది. తాజాగా దసరా ముహుర్తం ఖరారు కావడంతో సన్నాహాలు ముమ్మరం కానున్నాయి.

హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ సంస్థల సమూహం నిర్మాణానికి 2014 నవంబరులో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ రంగానికి సంబంధించిన ప్రముఖులతో ఆ ఏడాది డిసెంబరులోనే భూములను సందర్శించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం, కడ్తాల్‌ మండలాల్లోని 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ నిర్మాణానికి కార్యాచరణ మొదలైంది.

స్వదేశీ పరిశ్రమలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే దిశగా రూపకల్పన చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో పూర్తిగా కాలుష్య రహితంగా తీర్చిదిద్దడం, ప్రపంచ ఔషధ విశ్వవిద్యాలయం, లాజిస్టిక్‌ పార్కు, పరీక్ష ప్రయోగశాల, అంకురాల హబ్‌ ఏర్పాటు వంటివి ఈ ప్రణాళికలో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version