బంజారాహిల్స్ లో జలమండలి భూమి కబ్జాకు గురైందని జరిగిన ప్రచారం అవాస్తవని అధికారులు స్పష్టం చేసారు. మీడియా మాధ్యమాల్లో లో జరిగిన ప్రచారంపై జలమండలి తో పాటు రెవెన్యూ, హైడ్రా, పోలీసు అధికారుల సంయుక్తంగా తనిఖీ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో రెండు చోట్ల 2.20 ఎకరాలు మరో చోట ఎకరా భూమి జలమందలికి ఉందన్నారు జలమండలి అధికారులు. అందులో 6 ఎంఎల్ సామర్థ్యంతో జల మండలి రిజర్వాయర్ ఉందని జలమండలి అధికారులు తెలిపారు.
దీనికి 150 మీటర్ల దూరంలో మరో 1.20 ఎకరాలు ఉందని చెప్పిన జలమండలి.. అది రాళ్లతో కూడిన ఖాళీ స్థలం కావడంతో రెవెన్యూ అధికారుల చేత సర్వే నిర్వహించి స్పష్టమైన సరిహద్దులు కూడా ఏర్పాటు చేశామన్నారు.. ఈ స్థలంపై తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ సైతం ఉన్నట్లు వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని స్పష్టం చేసారు అధికారులు.