ఫార్ములా ఈ-కార్ రేసులో కేటీఆర్‌పై కేసు నమోదు చేసింది ఈడీ. ఏసీబీ దర్యాప్తు ఆధారంగా కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన ఈడీ.. మనీలాండరింగ్, ఫెమా ఉల్లంఘన కింద ఈడీ కేసు… కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. అయితే నిన్న ఈ కేసులో KTR పై ఏసీబీ fir నమోదు చేయగా.. అది తప్పుడు కేసు అంటూ ఈ రోజు కోర్టులో KTR లాయర్ ఆర్యామా సుందరం వాదించారు.
14 నెలల తర్వాత కేసు నమోదు చేయడంలోనే రాజకీయ కుట్ర అని అర్థమవుతుంది. కరప్షన్ జరగనప్పుడు పీసీ act KTR కు ఎలా వర్తిస్తుంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో స్పాన్సర్ వెనక్కి జరిగినప్పుడు… ఈవెంట్ నిర్వహించకపోతే హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఈ నిర్ణయం జరిగింది అని పేర్కొన్నారు. అయితే ఈ వాదనల తర్వాత హై కోర్టు KTR ను ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయకూడదు అంటూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.