తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఎనిమిది రోజుల సమయం ఉందన్న సంగతి తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. గ్రౌండ్ స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడుకు బ్రేకులు వేసేందుకు సీఎం కేసీఆర్ భారీ స్కెచ్ వేసినట్లు సమాచారం అందుతోంది.
తెలంగాణ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ తో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారట. కేవలం వారం రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఎలాంటి వ్యూహరచనలు అమలు చేయాలని దానిపై ప్రశాంత్ కిషోర్ తో దాదాపు మూడు గంటల పాటు సీఎం కేసీఆర్ చర్చించారట.
ఇందులో మంత్రి హరీష్ రావు తో పాటు కేటీఆర్ కూడా పాల్గొన్నట్లు సమాచారం అందుతుంది. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని అదుపు చేయాలని.. ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వ్యూహరచనలు చేశారట. మరి ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ తో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ కు బ్రేకులు పడతాయా ? లేదా అనేది చూడాలి. కాగా నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.