NCERT కీలక సిఫార్సులు.. చరిత్ర పుస్తకాల్లో రామాయణ, మహాభారత పాఠాలు!

-

ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆలోచన ఎట్టకేలకు కార్యరూపం దాల్చుతోంది. పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేర్పుల విషయంలో తాజాగా జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (NCERT) కమిటీ కీలక సిఫార్సులు చేసింది. పాఠశాల చరిత్ర పాఠ్యపుస్తకాల్లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఈ కమిటీ ప్రతిపాదనలు చేసింది. తరగతి గదుల్లోని గోడలపై రాజ్యాంగ పీఠికను స్థానిక భాషల్లో రాయాలని పేర్కొంది. సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ.. చరిత్రలోని పాఠ్యాంశాల్లో పలు మార్పులను ప్రతిపాదించింది.

అవేంటంటే..

ప్రస్తుతం సాంఘిక శాస్త్రంలో ఉన్న చరిత్ర ‘ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలు’గా ఉండగా.. మన చరిత్రను నాలుగు భాగాలుగా విభజించాలని ప్యానెల్‌ ప్రతిపాదించింది.

క్లాసిక్‌ పీరియడ్‌ (సంప్రదాయ చరిత్ర), మధ్య యుగం చరిత్ర, బ్రిటిష్‌ కాలం, ఆధునిక భారతదేశ చరిత్ర.. ఇలా నాలుగు భాగాలుగా వర్గీకరించింది.

క్లాసిక్‌ పీరియడ్‌లో ని పాఠ్యాంశాల్లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, పురాణాలను చేర్చాలని పేర్కొంది.

రాముడంటే ఎవరు? ఆయన ఉద్దేశాలు ఏమి? అనేది విద్యార్థులు తెలుసుకోవాలని కమిటీ సిఫార్సుల్లో తెలిపింది. ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాల గురించి విద్యార్థులు కొంతవరకైనా తెలుసుకోగలగాలని భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version