బీరు సీసాలో ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చాయి, దింతో మందుబాబు.. షాక్ తిన్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ఓ వైన్స్ షాపులో బీరు కొనుగోలు చేసాడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తి. అందులో వాటర్ బాటిల్ ప్లాస్టిక్ కవర్ రావడంతో ఖంగుతిన్నాడు యువకుడు.

వైన్స్ షాపు సిబ్బందిని ప్రశ్నించగా ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అంటూ తనపై దురుసుగా ప్రవర్తించారన్నాడు యువకుడు. ప్లాస్టిక్ వ్యర్థాలను గమనించకుండా బీరు తాగితే తమ పరిస్థితి ఏంటని యువకుడు ప్రశ్నించాడు.
బీరు సీసాలో ప్లాస్టిక్ వ్యర్థాలు.. షాక్ తిన్న మందుబాబు..
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఘటన
ఓ వైన్స్ షాపులో బీరు కొనుగోలు చేసిన వ్యక్తి
అందులో వాటర్ బాటిల్ ప్లాస్టిక్ కవర్ రావడంతో ఖంగుతిన్న యువకుడు
వైన్స్ షాపు సిబ్బందిని ప్రశ్నించగా ఎక్కడ చెప్పుకుంటావో… pic.twitter.com/p90WKI3VjS
— BIG TV Breaking News (@bigtvtelugu) July 3, 2025